calender_icon.png 24 November, 2024 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ పునరుద్ధరించాలి

24-11-2024 06:30:17 PM

పి ఆర్ టి యు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్ష వర్ధన్ రెడ్డి

కామారెడ్డి (విజయక్రాంతి): ఉద్యోగులకు ప్రభుత్వం ఓ పి ఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని పిఆర్టియు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పి.ఆర్.టి.యు తెలంగాణ కామారెడ్డి జిల్లా శాఖ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. ఐదు ప్రధాన ఎజెండా అంశాలు సాధించే లక్ష్యంతో ఉపాధ్యాయ సమస్యలపై ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. మోడల్ స్కూల్లో అన్ని రకాల గురుకులాలను ఒకే గొడుగు కిందికి తీసుకోవచ్చు 010 పద్దు కింద జీతాలు ఇప్పిస్తూ నియమించాలని డిమాండ్ చేశారు.

సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ హెల్త్ కార్డు ఇప్పించాలి తీర్థయాత్రను నియమించాలి. ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో ట్రాన్స్ఫర్ చేయడం ప్రతినెల ప్రమోషన్ ఇప్పించడం మిగతా ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడం చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో వి.ఆర్.టి.యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతి సత్యనారాయణ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, ప్రధాన కార్యదర్శి జనాపాల లక్ష్మీరాజ్యం, క్రమశిక్షణ సంఘం కమిటీ అధ్యక్షులు యుగేందర్ రెడ్డి, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు శ్యాంబాబు, ఆర్కే గ్రూప్స్ చైర్మన్ జైపాల్ రెడ్డి, సాయిబాబా, ఆది ప్రతాపరెడ్డి, అంకం సంతోష్, గజానంద్, నర్సింగరావు, రాము, కృష్ణ, సురేందర్, లెనిన్, ఆనంద్, ఎలా గౌడ్, రాజశేఖర సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.