calender_icon.png 31 October, 2024 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వం చాటుకున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రవీందర్ రెడ్డి

13-09-2024 09:12:19 PM

రాజాపూర్, (విజయక్రాంతి): విద్యార్థులకు విద్యను అందించేడమే కాదు.. వారికి అండగా నిలవడమే ఉపాధ్యాయుడి లక్షణం అని రవీందర్ రెడ్డి నిరూపించారు. మహబూబ్ నగర్ జిల్లా రాజపూర్ మండల పరిధిలోని నర్సంపల్లి తండాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న రవీందర్ రెడ్డి. అటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు విద్యార్థులకు ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉండడానికి తనవంతు సహాయం చేస్తూ ముందుకు కొనసాగుతున్నాడు. ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ రావ్ ప్రోత్సాహంతో నర్సంపల్లి తండా పాఠశాల 5వ తరగతి చాడుతున్న పూజ అనే విద్యార్థినీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. నిరుపేద కుటుంబానికి చెందిన పూజకు RBSK team వాళ్లు గుండెలో రంద్రం ఉన్నట్టు గుర్తించారు.

ఈ విషయాన్ని తల్లిదండ్రులు హెడ్ మాస్టర్ రవీందర్ రెడ్డికి తెలిపారు.రవీందర్ రెడ్డి కొంత ఆర్థిక సహాయం అందించడతోపాటు తనకున్న పరిచాయలతో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.ఎంపీ వెంబడి స్పందించి అపోలో హాస్పిటల్ లో చిన్నారికి ఉచిత గుండె శస్త్ర చికిత్స నిర్వహించి చిన్నారి ఆరోగ్యం మెరుగుపడే విధంగా సహకరించారు.లక్షల రూపాయలు ఆపరేషన్ కు అవసరం అవుతుంది అని తెలిసి, ఆ చిన్నారిని తీసుకొని హైదరాబాద్ కు ఎన్నోసార్లు తిరిగి, తనకు తెలిసిన పరిచయాలతో ఆ చిన్నారికి ఉచిత ఆపరేషన్ చేయించిన పాఠశాల హెడ్ మాస్టర్ రవీందర్ రెడ్డికు గిరిజన తండా వాసులు, బాలిక తల్లిదండ్రులు  అభినందనలు తెలిపారు.