- జీవనోపాధి కల్పనకు ప్రణాళిక
- విద్యాసంవత్సరం నష్టపోకుండా విద్యార్థుల తరలింపు
- మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): మూసీ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డీసీఎల్) ఎండీ దాన కిశోర్ స్పష్టం చేశారు.
శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఎన్‌ఐయూఎం కాన్ఫరెన్స్ హాల్‌లో మూసీ పౌరసంస్థల ప్రతినిధులతో మూసీ సుందరీకరణ, అభివృద్ధి, నిర్వాసితులకు పునరావాస అంశాలపై సమావేశం నిర్వహించారు. ఎన్‌జీవోల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు తీసుకు న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ రివర్‌ను పునరుద్ధరించక పోతే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారన్నారు.
మేధాపా ట్కర్ సహా అనేకమంది సామాజిక కార్యకర్తలు సేవ్ మూసీ కార్యక్రమాలను నిర్వహిం చిన విషయాన్ని గుర్తు చేశారు. లండన్ థేమ్స్, సౌత్‌కొరియాలోని సియోల్ నదుల లాగా మూసీనది అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టారన్నాని చెప్పారు. ప్రభుత్వం ఏకపక్షంగా కాకుండా నిర్వాసితులతో చర్చించి వారి పునరావాస కార్యక్రమాలు చేపడుతున్నట్లు దాన కిశోర్ వివరించారు.
ప్రతీ నిర్వాసిత కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కేటాయిస్తామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 15 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించినట్లు స్పష్టం చేశారు. నిర్వాసితుల కుటుంబాలకు జీవనోపాధులపై సర్వే చేస్తున్నామనిన్నారు. స్వయం సహాయక సంఘాలపై ఫోకస్‌పెట్టి ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని సెర్ఫ్ మేనేజర్ దివ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్ అమ్రపాలి, సీడీఎంఏ డైరె క్టర్ గౌతమ్ తెలిపారు.
మెప్మా సంఘాలకు బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందించబోతున్నట్లు తెలిపారు. మూసీ బఫర్‌జోన్ లోని నిర్మాణాల సర్వే, మార్కింగ్ ప్రక్రియను కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవో, తహశీల్దార్లతో చేపడుతామని దాన కిశోర్ తెలిపారు. ఇప్పటికే రివర్‌బెడ్‌లోని నిర్మాణాల సర్వే, మార్కింగ్ ప్రక్రియ చేపట్టామన్నారు.
రివర్ బెడ్‌లో కొందరికి పట్టాలున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు. అలాంటి వారు తమ పట్టాలను కలెక్టర్లకు అందజేయాలని, వారు అర్హులైతే పరిహారం అందజేస్తామన్నారు. మూసీ పునరావాస ప్రక్రియ సజా వుగా సాగేందుకు ఉన్నతాధికారులతో హైలెవల్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
విద్యాసంవత్సరం నష్టపోకుండా..
మూసీ నిర్వాసిత కుటుంబాల్లోని విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా తరలింపు ప్రక్రియ చేపడుతామన్నారు. ఎన్‌జీవో ప్రతినిధులతో కూడిన కమిటీతో సర్వే చేయించి వారి నివేదిక ఆధారంగా డబుల్ బెడ్‌రూమ్‌ల సముదాయాలకు దగ్గరలోని స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న వారిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో చేర్పిస్తామన్నారు.
విద్యాశాఖ అధికారులతో సమీక్ష..
మూసీ ప్రక్షాళనలో భాగంగా నిర్వాసిత కుటుంబాల్లోని విద్యార్థుల చదువులకు ఇబ్బందులు కలుగకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని దానకిశోర్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి సచివాలయంలో సంక్షేమ, విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ మూసీ నిర్వాసితుల కుటుంబాల్లో అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లే చిన్నారులు మొదలు కాలేజీకి వెళ్లే విద్యార్థుల వివరాలు సేకరించేందుకు ఈనెల 28 నుంచి రెండు రోజుల సర్వే చేపడు తున్నట్లు తెలిపారు.
ఎన్‌జీవో ప్రతినిధులు సహకారమందించాలి
మూసీ సుందరీకరణకు ఎన్‌జీవో ప్రతినిధులు తమ సహకార మందించాలని దానకిశోర్ కోరారు. మూసీ నిర్వాసిత కుటుంబాలు ప్రభుత్వంతో నడిచేలా క్షేత్రస్థాయిలో చైతన్యం తేవాలని కోరారు. సమావేశంలో ప్రజావాణి నోడల్ అధికారి దివ్య, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎంఆర్‌డీసీఎల్ జాయింట్ ఎండీ పూజారి గౌతమి, ఎన్‌జీవో ప్రతినిధులు ప్రొ.హరగోపాల్, వీ సంధ్య, లిస్సిజోసెఫ్, టీ శ్రీహర్ష, అహ్మద్ పాల్గొన్నారు.