ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సబ్యసాచి ఘోష్
హైదరాబాద్, నవంబర్ 1(విజయక్రాంతి): రాష్ట్రంలో పాడి రైతులు పాలఉత్పత్తిలో గణనీయ ప్రగతి సాధించారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో ఉచిత పశువైద్య శిబిరాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ర్టంలో పాడి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, 2024-25 బడ్జెట్‌లో రూ.1,980 కోట్లు పశు సంవర్ధక శాఖకు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్, రాష్ర్టంలో పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా రాష్ర్టవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో 2,210 ఉచిత పశువైద్య గర్భకోశ శిబిరాలు 2024, అక్టోబర్ 25 నుంచి 2025, ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు.