- ప్రజల సౌకర్యార్థం వాయిస్ అప్లికేషన్ అభివృద్ధి
- 7 వేల గ్రామాల్లో లక్ష మంది విద్యార్థులతో డాటా సేకరణ
- స్వేచ్ఛ, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌తో తెలంగాణ ఐటీఈ అండ్ సీ శాఖ
- చాట్‌జీపీటీ తరహాలో ఏఐ వాయిస్ అసిస్టెంట్
- ఏఐ సమ్మిట్‌లో ప్రదర్శనకు రంగం సిద్ధం
హైదరాబాద్, జూలై 14 (వియక్రాంతి): చాట్‌జీపీటీ తరహాలో తెలుగు ఏఐ చాట్‌బాట్ రూపకల్పనపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ డాటాథాన్‌కు సంబంధించిన కసరత్తును ఇప్పటికే ప్రారంభించింది. తెలుగులో ఏ మాండలికంలో ఏం అడిగినా దానికి సమాధానం ఇచ్చేలా తెలుగు ఏఐ చాట్‌బాట్‌ను రాష్ర్ట ప్రభుత్వ ఐటీఈ అండ్ సీ విభాగం రూపొందిస్తోంది.
ఈ వాయిస్ కమాండ్ రూపకల్పనకు హైదరాబాద్‌కు చెం దిన ఎన్‌జీవో సంస్థ స్వేచ్ఛతో పాటు ఐఐఐటీ హైదరాబాద్, ఓజోనేటెల్, టెక్ వేదిక, టీఏఎస్‌కే ఆర్గనైజేషన్లు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి. డాటాను సేకరణకు తెలంగాణకు చెందిన దాదాపు లక్ష మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు స్వేచ్ఛ సంస్థ ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. దాదాపు ఏపీ, తెలంగాణలో 7 వేల గ్రామాల నుంచి ప్రస్తుతం డాటా సేకరణ ప్రక్రియ జరుగుతోంది.
రైతుకు సాయం..
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ నిర్వహణ దాదా పు ఇంగ్లీష్‌లోనే అందుబాటులో ఉంది. ఏ ప్రాంతీయ భాషలోనూ ఏఐ వాయిస్ అసిస్టెంట్ లేదు. ఈ క్రమంలో తెలు గు రాష్ట్రా ల్లోని మారుమూల ప్రజలు, ఇంగ్లీష్ రానివా రు కూడా ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోనేలా ప్రభుత్వం సరికొత్త వాయిస్ అసిస్టెం ట్‌ను తీసుకొస్తుంది. ఇందుకోసం తెలుగులోని అన్ని మాండలికాలను రికార్డు చేస్తోం ది. తెలుగు రాష్ట్రాల్లోని సంస్కృతి, సంప్రదాయాలు, సాంస్కృతిక, వ్యవహారికం, కథలు, నానుడులు, జాతీయాలు, వ్యవసాయం, వృత్తులు, కళలు, భాషల సమాచారాన్ని ఆయా మాడలికాల్లో రికార్టు చేసి మాటలను ప్రత్యేక వాయిస్ అప్లికేషన్లలో స్టోర్ చేస్తున్నారు.
ఇక తెలుగులో అలెక్సా
ఈ వాయిస్ అప్లికేషన్ అందుబాటులోకి వస్తే ఒక రైతు తన ఫొన్‌లోని ఏఐ వాయిస్ అసిస్టెంట్ ద్వారా పొలం దగ్గర మోటార్‌ను ఆపరేట్ చేయొచ్చు. ప్రస్తుతం అలెక్సా వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాయిస్ కమాండ్‌లు తెలుగులో అందుబాటులో లేవు. ఇది అందుబాటులోకి వస్తే ఎలక్ట్రానిక్ పరికరాల్లో తెలుగు వాయిస్ కమాండ్ వస్తుంది. తద్వారా తెలుగులో కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమవు తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ మాండలికంలోనైనా ఒక సాధారణ వ్యక్తి తనకు తెలియని విషయాన్ని తెలుగు ఏఐ చాట్‌బాట్‌ను అడిగితే అది టెక్ట్స్ లేదా ఆడియో రూపంలో క్షణాల్లో సమాచారాన్ని ఇస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయితే తొలి ప్రాంతీయ ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఇదే కానుంది.
ఏఐ సమ్మిట్‌లో ప్రదర్శన
రెండు నెలల్లో తెలుగు ఏఐ చాట్‌బాట్ ను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్ 1 నాటికి దీన్ని పూర్తి చేసి ఆ నెల 5,6 తేదీల్లో జరిగే ఏఐ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రదర్శించాలని భావిస్తోంది. ప్రపంచ దేశాల నుంచి 2వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో అత్యంత ప్రతిష్ఠాత్మంగా ప్రభుత్వం ఈ వాయిస్ అప్లికేషన్‌ను తయారు చేస్తోంది.
2023 నుంచే ప్రయత్నాలు..
వాస్తవానికి 2023 డిసెంబర్ నుంచే స్వేచ్ఛ సంస్థ తెలుగు ఏఐ చాట్‌బాట్ తయారీకి పనిచేస్తోంది. ప్రభుత్వంతో ఒప్పం దం కుదిరే నాటికే తెలుగులోని చందమామ కథలు, భేతాల స్టోరీలను టెక్ట్స్ రూపంలో ప్రత్యేక అప్లిషన్‌లో స్టోర్ చేసింది. ఇదివరకు పనిచేసిన అనుభవంతో ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఏఐ వాయిస్ అప్లికేషన్‌పై పని చేస్తున్నట్లు నిర్వాకులు చెప్తున్నారు. ఇప్పుడు తయారు చేసే ఐఐఐటీహెచ్, ఓజోనేటెల్, టెక్ వేదిక, టీఏఎస్‌కే సమన్వయంతో సరళమైన ఇంటర్‌ఫేస్‌తో తక్కువ ఖర్చుతో ఈ చాట్‌బాట్‌ను తయారు చేస్తున్నారు.
తెలుగు సంస్కృతిని కాపాడేందుకు
ప్రపంచంలోని ఏ ప్రాంతీయ భాష లో అయినా ఏఐ వాయిస్ అప్లికేషన్ ను తయారు చేయ డం అనేది సాధ్యం కాదు. పూర్తిస్థాయిలో ప్రాంతీయ భాష ల్లో సమాచారం లేకపోవడమే దీని ప్రధాన అవరోధం. దీని కోసం విస్తృతమైన డాటాను సేకరించాల్సి ఉంటుం ది. అందుకే మేము భారీస్థాయిలో ఇంజినీరింగ్ విద్యార్థులను ఉపయోగించుకున్నాం. వారికి ప్రత్యేక యాప్ ద్వారా శిక్షణ ఇచ్చాం. తెలుగు సంస్కృతిని కాపాడటానికి ఈ చాట్‌బాట్ దోహదపడుతుంది.
ప్రవీణ్ చంద్రహాస్,
స్వేచ్ఛ సంస్థ కార్యదర్శి