వీహెచ్‌పీఎస్ గౌరవాధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
ముషీరాబాద్, అక్టోబర్ 26: చేయూత పింఛన్‌దారులను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నట్టేట ముంచిందని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్) గౌరవాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నమ్మిన పింఛన్‌దారులు కాంగ్రెస్‌ను గెలిపించారని అన్నారు.
పది నెలలు గడుస్తున్నా ఎందుకు పింఛన్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో వచ్చే నెల మొదటి వారంలో గడిచిన 10 నెలల బకాయిలతో పాటు నవంబర్ పింఛన్ ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. నవంబర్ 1 నుంచి 16వ తేదీ వరకు ప్రతిరోజు రెండు జిల్లాల్లో చేయూత పింఛన్ లబ్ధిదారులతో చైతన్య సభలు నిర్వహిస్తామని తెలిపారు.
అప్పటికీ స్పందించకుంటే నవంబర్ 26న వికలాంగుల మహా గర్జన పేరిట వేలాది మందితో ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో జాతీయ అధ్యక్షులు సూరేపల్లి సుజాత, రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, మాజీ అధ్యక్షుడు అందె రాంబాబు తదితరులు పాల్గొన్నారు.