calender_icon.png 22 February, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

10-02-2025 05:04:13 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఎస్సీ కుటుంబాల్లో విభేదాలను సృష్టించేందుకే ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి ప్రధాన కార్యదర్శి రంజిత్ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో మాల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ముందు రాస్తారోకో నిర్వహించి ధర్నాను నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం తీర్మానం చేయడానికి వారు వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.