calender_icon.png 23 November, 2024 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ సుందీరకరణ పేరుతో ప్రభుత్వం దందా

28-09-2024 01:27:58 AM

బీఆర్‌ఎస్ నేత కార్తీక్‌రెడ్డి 

హైదరాబాద్, సెప్టెంబర్ 27        (విజయక్రాంతి): మూసీ సుందరీకరణ పేరుతో దందా నడిపేందుకు రాష్ర్ట ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్ నేత పీ కార్తీక్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తు న్నారో పాలకులకు అర్థం కావడం లేదని, ప్రజలకిచ్చిన హామీలపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు.

శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిరుమళ్ల రాకేశ్‌కుమార్, సతీష్‌రెడ్డి, గజ్జెల నగేశ్, దశరథ్‌లతో కలిసి మాట్లాడు తూ ప్రజలకు సంబంధం లేని విషయాలకు  ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తున్నారన్నారు. హైడ్రా పేరిట ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నా రని  మండిపడ్డారు.

2,400 కిలోమీటర్లలో చేపట్టిన నమామిగంగా ప్రాజెక్ట్‌కు రూ.40 వేల కోట్ల ఖర్చు కాలేదని, మూసీనదికి లక్షాయాభై వేల కోట్లతో డీపీఆర్ ఎలా తయారు చేస్తారన్నారు. ప్రజాభిప్రాయం తర్వాతే మూసీ సుందరీ కరణ చేపట్టాలన్నారు.