హైదరాబాద్: అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని పనుల టెండర్లు ద్వారా ప్రభుత్వ అవినీతి బయటపడిందని కేటీఆర్ ఆరోపించారు. ఎక్కువ కోట్ చేసిన అనుకూల కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారని కేటీఆర్ విమర్శించారు. రెండు కంపెనీలకు కట్టబెట్టడం అబద్ధమని ప్రజలు అనుకోరా..? అని ప్రశ్నించారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే రూ. 4,350 కోట్ల ప్రజాధనాన్ని కొందరికి అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తమ కుబేరుల ఖజానాను నింపుకోవడం, తెలంగాణను తమ ఏటీఎంగా ఉపయోగించుకోవడంలో నిమగ్నమై ఉందని కేటీఆర్ ద్వజమెత్తారు.