13-08-2024 12:32:42 AM
హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తును సర్కారు ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ ఛోంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఈ నెల 8వ తేదీనే వెలువడ్డాయి. జాయింట్ డైరెక్టర్ క్యాడర్‌లో ఉన్న ఆయనను గత నెల 27న మహబూబాబాద్ అదనపు జిల్లా ప్రజారోగ్య అధికారిగా ప్రభుత్వం నియమించింది. దీర్ఘకాలిక సెలవులో ఉన్న ఆయన కొత్త పోస్టులో చేరలేదు. ఆయన వీఆర్‌ఎస్‌ను గతంలో తిరస్కరించిన సర్కారు తాజాగా ఆమోదించింది.