calender_icon.png 19 October, 2024 | 12:10 PM

విద్యాకమిషన్ సభ్యులను నియమించిన ప్రభుత్వం

19-10-2024 01:29:01 AM

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): తెలంగాణ విద్యాకమిషన్‌కు స భ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించిం ది. ఈ మేరకు ముగ్గురు సభ్యులను ని యమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు, చారగొండ వెంకటేశ్, కే జ్యో త్స్న శివారెడ్డిలను సభ్యులుగా నియమించారు. ఇప్పటికే తెలంగాణ విద్యా కమిషన్‌ను చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

అయితే సభ్యుల నియామకాన్ని పెండింగ్‌లో పెట్టింది. తాజాగా ఆ సభ్యులను కూడా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నూతనంగా నియమితులైన ఈ ముగ్గురి లో ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు ఉ స్మానియా వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్‌తోపా టు, తెలంగాణ జనసమితి పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు. 

చార గొండ వెంకటేశ్ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి నేత కాగా, కేజోత్స్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసి ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. జోత్స్న కుత్బుల్లాపూర్‌కు చెం దిన కాంగ్రెస్ నాయకుడు శివారెడ్డి సతీమణి. విద్యావేత్తలను నియమించ కుండా పార్టీల రంగు పులుముకుందని  విద్యావేత్తల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.