హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. స్కూళ్ల పరిశుభ్రత బాధ్యతలను "అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ"కి అప్పగించింది. 30 మందిలోపు విద్యార్ధులున్న పాఠశాలలకు రూ.3 వేల గ్రాంటు, 31 నుంచి 100 మంది ఉన్న విద్యార్ధులున్న పాఠశాలలకు రూ.6 వేల గ్రాంటు, 101 నుంచి 250 మంది ఉన్న విద్యార్ధులున్న పాఠశాలలకు రూ.8 వేల గ్రాంటు, 251 నుంచి 500 మంది ఉన్న విద్యార్ధులున్న పాఠశాలలకు రూ.12 వేల గ్రాంటు, 501 నుంచి 750 మంది ఉన్న విద్యార్ధులున్న పాఠశాలలకు రూ.15 వేల గ్రాంటు, 750 మంది కంటే అధికం విద్యార్ధులున్న పాఠశాలలకు రూ.20 వేల గ్రాంట్లను 10 నెలల కాలానికి ఒకేసారి ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది.