13-03-2025 01:08:48 AM
రైతాంగానికి వెన్నుదన్నుగా ప్రభుత్వం: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వం రైతాంగానికి వెన్నుదన్నుగా నిలబడిందనే విషయం గవర్నర్ ప్రసంగంలో స్పష్టమయ్యిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన ప్రసంగంపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పందించారు.
తెలంగాణ రాష్ర్టంలో వ్యవసాయ అభివృద్ధికి గవర్నర్ ప్రసంగం దిశా నిర్దేశం చేసిందని కొనియాడారు. గవర్నర్ ప్రసంగం ఆసాంతం రాష్ర్టంలో వ్యవసాయ, నీటిపారుదల రంగాల్లో సాధించిన విజయాలను ప్రతిబింబిస్తోందని తెలిపారు. దేశంలో ముందెన్నడూ లేనివిధంగా ఏకకాలంలో రెండులక్షల రుణమాఫీ చేయడం ప్రభు త్వం సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు.
25.35 లక్షల మందికి రూ. 20,616.89 కోట్ల రుణాలను మాఫీ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ రుణమాఫీతో రైతులకు ఆర్థిక భద్రత కల్పించినట్లయిందని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ రైతుభరోసా పథకం కింద సంవత్సరానికి ఎకరాకు రూ. 12000కు పెంచి ఆధునిక సాంకేతిక పద్ధతులను రైతులు వినియోగించుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.
566 రైతు వేదికలను ఆధునీకరించి, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థతో రైతులతో నేరుగా మాట్లాడేలా రైతునేస్తం డిజిటల్ వేదికను రూపొందించిందన్న విషయాన్ని గవర్నర్ ప్రస్తావించడం వ్యవసాయ రంగంలో రాష్ర్ట ప్రభుత్వం సాధించిన విజయాలకు అద్దం పడుతుందన్నారు.
ఏడాదిలో రికార్డు స్థాయిలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించిన విజయాలను గవర్నర్ తన ప్రసంగంలో ఉటంకించడాన్ని స్వాగతి స్తున్నామన్నారు. సన్నాలను ప్రోత్సహించేందుకు క్వింటా లు ధాన్యానికి బోనస్ కింద 500 రూపాయలు అందిస్తున్నామన్నారు.
నీటి వివాదాల్లో రాష్ర్ట ప్రభుత్వం అప్రమ త్తంగా ఉండడంతో పాటు కృష్ణా జలాల వివాదాన్ని ట్రిబ్యునల్- ద్వారా పరిష్కరించడానికి రాష్ర్ట ప్రభుత్వ నిరంతరం కృషిని వివరించడం ప్రజా పరిపాలన సాధించిన విజయాలు ప్రతిధ్వనిస్తున్నాయన్నారు. ఇలా గవర్నర్ ప్రసంగం.. రైతాంగం పట్ల రాష్ర్ట ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని రుజువు చేసిందన్నారు.