calender_icon.png 30 January, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గవర్నర్ ప్రతిభాపురస్కారాల అందజేత

27-01-2025 12:32:47 AM

రాజ్‌భవన్‌లో తేనీటి విందుకు హాజరైన సీఎం, మంత్రులు, ప్రముఖులు

హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి): రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివా రం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రతి భా పురస్కారాలను అందజేశారు. గవర్నర్ ప్రత్యేక జీవితకాల సాఫల్య పుర స్కారాన్ని పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన అటవీ శాఖ అధికారి డా. జీ చంద్రశేఖర్ రెడ్డికి అందించారు.

వ్యక్తిగత విభాగంలో దుశ్చర్ల సత్యనారాయణ (పర్యావరణ పరిరక్షణ), అరికపూడి రఘు (వికలాంగుల సంక్షేమం), జీవాంజి దీప్తి (ఆటలు, క్రీడలు), పీబీ కృష్ణభారతి (సంస్కృతి), ప్రొఫెసర్ ఎమ్ పాండురం గారావు (సంస్కృతి)కు అందించారు.

సంస్థాగత విభాగంలో ధ్రువాంశ్ ఆర్గనైజేషన్ (పర్యావరణ పరిరక్షణ), ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ (దివ్యాంగుల సంక్షేమం), ఆదిత్య మెహతా ఫౌండేషన్ (ఆటలు, క్రీడలు), సంస్కృతి ఫౌండేషన్ (సంస్కృతి) పురస్కారాలు అందించారు. రాజ్ భవన్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యా రు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,  రాష్ర్ట హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజో య్ పాల్, కేంద్ర బొగ్గు, గనుల మంత్రి జీ కిషన్ రెడ్డి, కన్హా శాంతివనం వ్యవస్థాపకుడు కమలేశ్ డీ పటేల్, మంత్రులు, ఎం పీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.