calender_icon.png 23 April, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు భద్రాచలానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

07-04-2025 12:00:00 AM

భద్రాచలం, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర గవర్నర్  జిష్ణు దేవ్ వర్మ ఏప్రిల్ 7 తేదీన భద్రాచలం పట్టణంలోని మిథిలా స్టేడియంలో జరగనున్న పుష్కర పట్టాభిషేకానికి హాజరుకానున్నారు. ప్రతి ఏడాది శ్రీరామనవమి మర్నాడు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. శ్రీరామనవమికి ముఖ్యమంత్రి రాగా పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ హాజరవుతూ ఉం టారు. గతంలో రాష్ట్ర గవర్నర్ గా పని చేసిన నరసింహన్, తమిళ సై సౌందర్య రాజన్ హాజరవ్వగా ఈసారి  గవర్నర్ గా ఉన్న విష్ణుదేవ్ వర్మ హాజరవుతున్నారు. 

హైదరాబా దులో ఉదయం 9 .30 గంటలకు  బేగంపేట విమానాశ్రయం నుంచి  హెలికాప్టర్లో బయలుదేరి 11 .30 గంటలకు భద్రాచలం చేరుకుంటారు .అక్కడి నుండి ఐటీసీ గెస్ట్ హౌస్ లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని  భ ద్రాది రామాలయం కు 11 .40 గంటలకు చేరుకొని సీతారామచంద్రస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం  మిథిలా స్టేడియంలో జరిగే శ్రీరామ పట్టాభిషేకానికి హాజరవుతారు.

పట్టాభిషేకం  పూర్త యిన అనంతరం మధ్యాహ్నం 12:45 గంటలకు నుండి బిపిఎల్ అతిథి గృహం చేరు కుంటారని అధికార ప్రకటన లో తెలియజేశారు. బిపిఎల్ అతిధి గృహం నుండి మ ధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి బిపిఎల్ హెలిప్యాడ్ కు చేరుకొని అక్కడినుండి హెలికాప్టర్ ద్వారా 2. 30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకొని రాజ్ భవన్ కి వెళ్తారని కూడా ఆ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర గవర్నర్ గవర్నర్ కృష్ణదేవ వర్మ  పట్టాభిషేకానికి భద్రాచలం వస్తుండడంతో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.