calender_icon.png 23 December, 2024 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధుల సన్మానం

22-12-2024 08:51:19 PM

రామాయంపేట: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆదివారం నాడు మెదక్ జిల్లాలో పర్యటించారు. గవర్నర్ రాజ్ భవన్ నుండి నేరుగా రోడ్డు మార్గం ద్వారా మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఉదయం 11 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. ఆయనకు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ పి లక్ష్మణ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్, కోశాధికారి డి.జి.శ్రీనివాస శర్మ, కమిటీ సభ్యులు సత్యనారాయణ, వేణుతో పాటు పలువురు స్వాగతం పలికారు. గవర్నర్ కు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో స్వాగతం పలికారు.