calender_icon.png 12 March, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం

12-03-2025 11:47:06 AM

ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ భౌగోళిక ప్రాంతమే కాదు.. ఒక భావోద్వేగం

స్థిరత్వం, దృఢసంకల్పానికి గుర్తు తెలంగాణ

తెలంగాణ రైతులు రాష్ట్రానికి ప్రాణం 

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) బుధవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరయ్యారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) ప్రసంగిస్తున్నారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్, ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందని గవర్నర్ పేర్కొన్నారు. మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాల సహకారం అందిస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ స్పష్టం చేశారు. రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ, ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో కృషి చేశారు. జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నాం, సామాజికి న్యాయం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Thalli Statue) ఆవిష్కరించుకున్నాం. అభివృద్ధి, ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తోంది. 

రాష్ట్రానికి రైతులే ఆత్మ.. వారి అభివృద్ధికి కృషి చేస్తున్నాం

రాష్ట్రానికి రైతులే(Farmers) ఆత్మ.. వారి అభివృద్ధికి కృషి చేస్తున్నాం, ప్రజల కోసం నిరంతరం శ్రమించే వాళ్లే అన్నదాతలు, రాష్ట్ర అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉందని గవర్నర్ తెలిపారు. రైతులకు మద్దతివ్వడం..వారిని శక్తిమంతులుగా తీర్చిదద్దడమే మా బాధ్యతన్నారు. దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్ర తెలంగాణ అన్నారు. రైతులకు రుణమాఫీ(Loan waiver for farmers) చేశాం.. ఇదే రైతుల పట్ల మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శమని ఆయన వెల్లడించారు. 25.35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించామని చెప్పారు. ఎకరానికి రూ. 12 వేలు చొప్పున రైతులకు అందిస్తున్నామని తెలిపారు. రైతు నేస్తం అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. వరి రైతులకు రూ. 500 చొప్పు బోనస్ ఇస్తున్నాం. రైతుల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశామన్నారు.

గేమ్ ఛేంజర్ గా మహాలక్ష్మి పథకం

గేమ్ ఛేంజర్ గా మహాలక్ష్మి పథకం(Mahalakshmi scheme) తీసుకొచ్చామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ పురోగమించడమే కాదు.. రూపాంతరం చెందుతోందని చెప్పారు. సమ్మిళిత, స్వయం సమృద్ధి, సాధికార తెలంగాణ విజన్ తో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. అభివృద్ధి, సమృద్ధికి దిక్సూచిగా ఉండేలా తెలంగాణ నమూనా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ భౌగోళిక ప్రాంతమే కాదు.. ఒక భావోద్వేగం అన్నారు. స్థిరత్వం, దృడ సంకల్పానికి గుర్తు  తెలంగాణ అన్నారు.

తెలంగాణ రైతులు రాష్ట్రానికి ప్రాణం లాంటివారు. రైతుల స్వేదం, కష్టం మన ప్రజలను పోషిస్తోందన్నారు. 260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించింది. ఇది మన రైతుల స్థిరత్వం, అంకిత భావానికి ఒక సాక్ష్యం అన్నారు. రూ. 2 లక్షల పంట రుణమాఫీని అమలు చేస్తున్నాం. రూ. 20,616.89 కోట్లతో 25.35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. ఇది ప్రభుత్వం చేసిన వాగ్ధానాల నిర్దిష్టాకాల అమలుకు సాక్ష్యం అన్నారు. రైతు భరోసా కింద నేరుగా ఆర్థిక సహాయం అందిస్తున్నామని గవర్నర్(Jishnu Dev Verma) తెలిపారు.