calender_icon.png 20 January, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్-2024 ప్రకటించిన రాజ్ భవన్

20-01-2025 07:17:04 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ గవర్నర్ కార్యాలయం గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు-2024 గ్రహీతలను సోమవారం ప్రకటించింది. వివిధ రంగాలలో సేవలందించిన మొత్తం 8 మంది  వ్యక్తులు, సంస్థల జాబితాను వెల్లడించింది. జనవరి 26, 2024న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణ, వికలాంగుల సంక్షేమం, క్రీడలు, సంస్కృతి రంగాలలో రాణించిన వ్యక్తులు, సంస్థలకు ఏటా గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేయాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయించారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ రంగాలలో అత్యుత్తమ సేవలందించిన వారికి గవర్నర్ ప్రతిభ పురస్కారాలు ఇవ్వనున్నట్లు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. ప్రతి గ్రహీతకు జ్ఞాపిక, రూ.2 లక్షల నగదు బహుమతి అందించనున్నారు.

ఎంపికైన అవార్డు గ్రహీతలు:

  • దుషర్ల సత్యనారాయణ
  • అరికపూడి రఘు 
  • పారాలింపిక్ పతక విజేత జీవంజీ దీప్తి
  • ప్రొఫెసర్ ఎం. పాండురంగారావు, పి.బి. కృష్ణభారతి (సంయుక్తంగా)
  • ధృవంశు సంస్థ
  • ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి
  • ఆదిత్య మెహతా ఫౌండేషన్
  • సంసుత్రి ఫౌండేషన్