calender_icon.png 2 October, 2024 | 1:45 PM

మహాత్ముడికి అంజలి ఘటించిన గవర్నర్, సీఎం

02-10-2024 11:48:49 AM

హైదరాబాద్, కార్వాన్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంజలి ఘటించారు. గవర్నర్ బుధవారం ఉదయం 6 గంటలకు గవర్నర్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో సహా బాపు ఘాట్ కు చేరుకొని బాపు సమాధి వద్ద నివాళి అర్పించారు. అనంతరం వారు మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలవేసి అంజలి ఘటించారు. 

ఆలస్యంగా చేరుకున్న సీఎం రేవంత్ 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాపు ఘాట్ కు నిర్ణీత సమయానికంటే ఆలస్యంగా చేరుకున్నారు. లంగర్ హౌస్ డిఫెన్స్ కాలనీ రాజీవ్ గాంధీ నగర్ కు చెందిన మూసీ బాధితులు ఆందోళన నిర్వహిస్తారని అనుమానంతో సీఎం రేవంత్ రెడ్డి 10 గంటల 48 నిమిషాలకు బాపు ఘాట్ చేరుకున్నారు. అనంతరం మంత్రులు, ఇతర ప్రముఖులతో కలిసి ఆయన మహాత్ముడికి నివాళి అర్పించారు.