calender_icon.png 12 January, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాజెక్టుల పేరుతో జేబులు నింపుకున్న ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెప్పారు

03-01-2025 08:47:39 PM

తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ డా కోదండరాం

ప్రజాస్వామిక వాతావరణం ఉన్నందునే కాంగ్రెస్ కు మద్దతు

బ్రష్టు పట్టిన రాజకీయాల మార్పు కోసం టీజేఎస్ ఆవిర్భావం

జిల్లా ప్లీనరీలో టీజేఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ప్రాజెక్టుల పేరుతో జేబులు నింపుకున్న ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెప్పారని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్రంలో బ్రష్టు పట్టిన రాజకీయాల స్థానంలో సమూల మార్పు రావాలని అలాంటి లక్ష్యాన్ని సాధించేందుకే టీజేఎస్ పార్టీ ఆవిర్భావించిందన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో గల కొమరం భీమ్ కార్యాలయ ప్రాంగణంలో టీజేఎస్ జిల్లా ప్లీనరీ సమావేశం జిల్లా అధ్యక్షులు బరగడి దేవదానం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పేరుతో జేబులు నింపుకొని ప్రజల్ని ఆందోళనలకు దూరంగా ఉంచుతూ, తప్పుడు కేసులు పెడుతూ, నియంతృత్వాన్ని తెచ్చిన ప్రభుత్వాలను ప్రజలు ఓడించారని అన్నారు. నేడు అలాంటి ప్రభుత్వం స్థానంలోనే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందన్నారు.

ప్రజలను మభ్యపెట్టకుండా స్వేచ్ఛ స్వతంత్రాలను కల్పిస్తూ, ఉద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి, నిరుద్యోగుల విషయంలో సానుకూల వాతావరణన్ని అవలంబిస్తుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మణుగూరులో చేపట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్ అవినీతి విషయంలో విచారణ జరుగుతుందన్నారు. గోదావరి 1వ దశ పూర్తి చేసి ఇల్లందు ప్రాంతానికి నీరు అందించటం, కేటీపీఎస్ 6వ దశ స్థానంలో 800 మెగావాట్ల ప్లాంట్లను 2 ఏర్పాటు చేయాలని, సింగరేణిలో 32 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ఉద్యమకారులకు ఇచ్చిన 6 హామీలు అమలు చేయాలని, భద్రాచలంలో ఆంధ్రాలోకి వెళ్లిన 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని, చత్తీస్గడ్ నుంచి వలస వచ్చిన గుత్తి కోయిలకు కులం సర్టిఫికెట్లు ఇవ్వాలని, సభ ఆమోదించిన తీర్మానాలను పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పోరాటాలలో చేపడుతుందని అన్నారు. సభలో జిల్లా కార్యదర్శి శంకర్రావు, రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శి, నాయకులు రామనాథం, సిద్దులు, నబి, వన్నారం శ్రీను, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.