21-04-2025 01:27:50 AM
భారతీయ జవాన్ కిసాన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గండే సురేంద్రనాథ్
ముషీరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : రైతులు, సైనికుల సమస్యలను కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేస్తున్నాయని భారతీయ జవాన్ కిసాన్ పార్టీ (బీజేకే పీ) రాష్ట్ర అధ్యక్షులు గండే సురేంద్రనాథ్ మ ండి పడ్డారు. సమస్యలను పరిష్క రించడా నికి జై జవాన్ జై కిసాన్ నినాదంతో బీజేకేపీ అవతరించిందని అన్నారు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర కార్యవర్గ సమావేశ ం నిర్వహించారు.
ముఖ్య అతిధులుగా జా తీయ అధ్యక్షులు నారాయణ ప్రభాకర్ అం కుష్, జాతీయ సమన్వయ కర్త సుదర్జీ మో హన రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేంద్రనాథ్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అరికట్టడం కోసం తమ పార్టీ పనిచేస్తుందన్నా రు. దేశం కోసం పోరాడిన సైనికులు, దేశానికి అన్నం పెట్టే రైతన్నలు అందరూ ఏకం కావాలన్నారు.
సుస్థిరమైన పరిపాలన కొ రకు ప్రజలతో కలిసి ప్రభుత్వాలు పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలపేతం చేసేందుకు త్వరలోనే జిల్లా పర్యటనలు చేపడతామని తెలిపారు. సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పోరా టం సాగిస్తామని అన్నారు. బీజేకేపీ సెంట్రల్ కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో గురించి వివరించారు.
ఈ సమావేశం లో పార్టీ జాతీయ నాయకులు జగ్ బీర్ సిం గ్, తెలంగాణ, ఏపీ నేతలు పి.సత్య ప్రసాద్ రావు, ఉపాధ్యక్షులు దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి, జి.ప్రశాంత్, డి.నారాయణ రెడ్డి, ఆర్.రజిత, ఆర్.సునీత, శివప్రసాద్ గౌడ్, ఎం.రాజయ్య, పి.నిరంజన్ రెడ్డి, ఎం.మాధవరెడ్డి జి.హనుమంతరా వు, కె.హనుమంతరావు, ప్రేమ్ సింగ్ రాథోడ్, టి.మంజుల, వివిధ సంస్థల ప్రతినిధులు టి.రమేష్, బొల్లి ఆధామ్ రాజ్, కొండ్రు అజయ్ పాల్గొన్నారు.