calender_icon.png 8 April, 2025 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డుల జారీలో ప్రభుత్వ వైఖరి సరికాదు

08-04-2025 12:28:02 AM

ఖమ్మం, ఏప్రిల్ 7 ( విజయక్రాంతి ):- రేషన్ కార్డుల జారీలో ప్రభుత్వ వైఖరి సరి కాదని అనేక మంది అర్హులకు రేషన్ కార్డులు రాకుండా చేసే ప్రయత్నం జరుగుతుందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేశ్ ఆరోపించారు. రకరకాల కారణాలతో రేషన్ కార్డులను అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. సిపిఐ జిల్లా కౌన్సిల్ నగర సమితి సభ్యుల సమావేశం సోమవారం స్థానిక గిరిప్రసాద్ భవన్ లో జరిగింది. సిపిఐ నగర కార్యదర్శి ఎస్కె జానిమియా అధ్యక్షతన జరిగిన సభలో సురేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం దశాబ్ద కాలం పాటు రేషన్కార్డులను ఇవ్వలేదని ఆయన తెలిపారు.

ఇప్పుడు రేషన్కార్డుల ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం అభినందనీయమే అయిన కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయని రేషన్ కార్డులను అధికారులు నిలుపుదల చేయాలని చూస్తున్నారని మారిన పరిస్థితుల్లో కార్లు బతుకు దెరువుగా మారాయన్న వాస్తవాన్ని గుర్తించాలని సురేష్ సూచించారు. నగరంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, కొండపర్తి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు, కార్పొరేటర్ బిజి క్లెమెంట్, పోటు కళావతి, మహ్మద్ సలాం, మిడికంటి వెంకటరెడ్డి, సిహెచ్ సీతామహాలక్ష్మి, మేకల శ్రీనివాస్, పగడాల మల్లేష్, ప్రజా సంఘాల బాధ్యులు గాదె లక్ష్మి నారాయణ, తాటి నిర్మల, యడ్లపల్లి -శంకరయ్య, యానాలి సాంబశివరెడ్డి, జ్వాల నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.