calender_icon.png 31 January, 2025 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళితుల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలి

31-01-2025 12:00:00 AM

హిమాచల్ ప్రదేశ్ అధ్యయన బృందం 

సిద్దిపేట, జనవరి 30 (విజయక్రాంతి) : దేశంలో వివక్షత ఎదుర్కొంటున్న దళితుల అభివృద్ధి కోసం రాష్ర్ట ప్రభుత్వాలు కృషి చేయాలని హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టంలో ఎస్సీ సబ్ ప్లాన్ ఉద్యమకారులు సుక్దేవ్ విశ్వాక్, బిమ్లా విశ్వాక్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్ మండలాలలో పర్యటించారు. ఎస్సీ సర్పంచిగా ఉత్తమ అవార్డు పొందిన అనంత సాగర్ గ్రామాన్ని సందర్శించి ఎస్సీల జీవన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.

సబ్ ప్లాన్ నిధుల ద్వారా నిర్మించిన కుల సంఘం భవనం, అంగన్వాడి కేంద్రం, సిసి రోడ్లు పరిశీలించారు. చేలకలపల్లిలో రోడ్డ జాకబ్ దళిత బంధు పథకం ద్వారా ఏర్పాటుచేసిన పాడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని సందర్శించి పరిశీలించారు. సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని మిట్టపల్లి బాలికల గురుకుల పాఠశాల, డిగ్రీ కళాశాలను సందర్శించి ఎస్సీ సప్లు నిధులు సమకూర్చే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ సబ్ ప్లాన్ అమలు కోసం హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టంలో ఉద్యమిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ సేకరించిన అంశాలను తమ రాష్ర్ట ప్రభుత్వానికి నివేదిస్తామంటూ వెల్లడించారు. వారి వెంట సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఫీల్డ్ ఆఫీసర్ దినేష్, ప్రోగ్రెసివ్ పేరెంట్ లీగ్ రాష్ర్ట ఉపాధ్యక్షులు మెట్ల శంకర్, ప్రతినిధులు గాజుల బాబు, పొన్నాల నర్సింలు, డబ్బు దశరథం, భూపాల్, జమున, వనిత పాల్గొన్నారు.