05-04-2025 12:00:00 AM
ఈబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4(విజయక్రాంతి) : అగ్రవర్ణ పేదలను క్రేంద్ర, రాష్ట్ర పభుత్వాలు ఆదుకోవాలని ఈబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆయన అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఈబీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈబీసీలకోసం కేం ద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖతో పా టు, కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ సంఘాల ప్రతినిధులు తోడేటి నర్సింహారెడ్డి, చందు జనార్ధన్, బోడ్డు రవిశంకర్‌రావు, నీలగిరి దివాకర్‌రావు, గట్టు శ్రీనివాస చార్యులు, పోచంపల్లి రమణరావు, మొగిళ్లపల్లి ఉపేందర్‌గుప్త, ఓలం యాదగిరి, యూసుఫ్ బాబు, నూకల పద్మారెడ్డి, ఉన్నం సుబ్బారావు, రంగిశెట్టి మంగబాబు, సుకురాం చౌదరి, బొబ్బిలి దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.