10-03-2025 12:50:43 AM
హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): రాష్ర్టంలోని పేద, బడుగు, బలహీన, మధ్యతరగతి పిల్లలకు అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించడానికి తమ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తోందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మల్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి రూ.11,000 కోట్లను కేటాయిస్తూ తమ సర్కారు తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రలోనే చరిత్రాత్మకమైనదన్నారు. ఆదివారం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో భట్టి భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు..
కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నేలా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తోందన్నారు. విద్యార్థులకు అన్ని వసతులతో పాటు సాంకేతికంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిజిటల్ విద్యా బోధన చేయడానికి డిజైన్ చేశామన్నారు.
ఇప్పటికే మూడు పాఠశాలలను మంజూరు చేసి రూ.600 కోట్లు నిధులను కేటాయించామన్నారు. 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో అద్భుతమైన క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, బోధన చేసే ఉపాధ్యాయులకు కూడా అక్కడే వసతి కల్పించడానికి గృహ సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. రెసిడెన్షియల్ పాఠశా లల్లో చదివే విద్యార్థులు ప్రపంచంతో పోటీపడే విధంగా సిలబస్‌ను రూపొందిస్తున్నట్టు చెప్పారు.
ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే సంస్థల్లో పనిచేసే విధంగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ర్ట ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ, ప్రభుత్వం పోగేస్తున్న ప్రతి పైసాను ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి వినియోగిస్తున్నామన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఒకేసారి 55 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై భట్టి కృతజ్ఞతలు తెలిపారు. మీడియా సమావేశంలో పార్లమెంట్ సభ్యులు రామసహయం రఘురాంరెడ్డి, బలరాంనాయక్, ఖమ్మం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, కోరం కనకయ్య, మాలోతు రాందాస్ నాయక్, పా యం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
55 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఇవే..
రాష్ట్రంలో 55 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మించేందుకు రూ.11,000 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక పాఠశాలలకు రూ.200కోట్ల చొప్పున కేటాయించింది. ఒక స్కూల్‌కు అందుబాటులో ఉన్న భూ మిని బట్టి.. 20 నుంచి 25 ఎకరాల్లో నిర్మించనుంది.
ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు గతేడా ది అక్టోబర్‌లో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.200కోట్ల చొప్పున మంజూరు చేసిన నియోజకవర్గాలు ఇవే..