12-03-2025 01:17:17 AM
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, మార్చి 11(విజయ క్రాంతి): దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో దివ్యాంగుల ప్రజావాణి కార్యక్రమం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి విశేష స్పందన లభిస్తుందని వారి ద్వారా స్వీకరించిన దరఖాస్తును సత్వర న్యాయం జరిగే దిశగా చర్యలు చేపడతామన్నారు, దివ్యాంగుల వివిధ సమస్యలపై 23 దరఖాస్తు స్వీకరించడం జరిగిందని తెలిపారు. మానవతా దృక్పథంతో వాటిని త్వరగా సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరిస్తామన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.