17-03-2025 02:01:06 AM
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి
మునుగోడు, మార్చి 16 : ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు. చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో రామలింగేశ్వరస్వామి జాతరలో భాగంగా ఆదివారం రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి హాజరై గ్రామస్తులతో కలిసి స్వామివారి రథాన్నిలాగారు.
అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామితో దయతో నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. అంతకుముందు వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.