14-02-2025 12:00:00 AM
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి13: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం నిర్మించుకున్న భవనం లొ గురువారం జరిగిన ఆత్మీయ సమావే శంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ముదిరాజుల అభివృద్ధి కోసం ఈ ప్ర భుత్వం పాటుపడుతుందన్నారు. ఇంత పెద్ద భవన సంఘాన్ని ప్రభుత్వం ద్వారా ఒక్క రూపాయి లేకుండా సంఘటితంగా ప్రతి సభ్యుడు డబ్బులు పోగు చేసుకొని భవనా న్ని నిర్మించుకోవడం సంతోషకరమన్నారు.
ఈ ప్రభుత్వం బీసీ కులాల కోసం రిజర్వే షన్లు 42 శాతం తీసుకురావడానికి అసెంబ్లీ లో బిల్లును ప్రవేశపెడతామన్నారు. ఈనెల 16 నుండి 28 వరకు కులగరణ సర్వేలో పాల్గొనని వారు మళ్లీ నమోదు చేసుకొని వారి వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. చెరువుల అభివృద్ధిలో ముదిరాజులకు ప్రత్యేక స్థానం కేటాయించ డం జరిగిందన్నారు. వీరి కోసం ప్రభుత్వప రంగా ముదిరాజుల వృత్తిరీత్యా వారికి సం బంధించిన పరికరాలను అందజేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారా యణ గౌడ్,మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సాబేర బేగం, వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి,జిల్లా మత్స్యశాఖ అధ్యక్షులు చొప్పరి రామ చంద్రం,జిల్లా ముదిరాజు సంఘం అధ్యక్షుడు చొక్కా రాము,జిల్లా బీసీ సెల్ డైరెక్టర్ వెంకటస్వామి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య,జిల్లా ఉపా ధ్యక్షుడు షేక్ గౌస్, డైరెక్టర్ శ్రీనివాస్, నాయ కులు డా.దేవేందర్, పిట్టల భూమేష్, రాజకు మార్, సనుగు రమేష్, పిట్ల రాంగోపాల్ రావు, శ్రీనివాసరావు, రమేష్, బాబు, భీమ య్య, సత్తయ్య, దండ శ్రీనివాస్, రాజయ్య, రవి, సాయికుమార్,సంఘం సభ్యులు పాల్గొన్నారు.