కొన్ని కేసులోనే మినహాయింపు
8:1తో మెజారిటీతో సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ, నవంబర్ 5: ప్రైవేటు వ్యక్తులకు చెందిన ఆస్తులను ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడానికి వీలు లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని కేసుల్లో మినహాయింపు ఉంటుందని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం 8:1 మెజారిటీతో స్పష్టం చేసింది. దీంతో ప్రైవేటు ఆస్తుల స్వాధీనంలో విషయంలో అపెక్స్ కోర్టు చరిత్రాత్మక తీర్పును ఇచ్చినట్లయింది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అంటే 1950ల నాటి భారత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం మాట్లాడకూడదని పేర్కొన్నది. ఆ సమయంలో సంస్థల జాతీయీకరణ జరుగుతోందని, కానీ ఇప్పుడు పెట్టబడుల ఉపసంహదరణ జరుగుతోందని చెప్పింది.
ఇప్పడు అన్ని సంస్థల్లో ప్రైవేట్ పెట్టుబడులు ఉన్నాయిని అంటే అప్పటికీ ఇప్పటికీ మార్పు జరిగిందని తెలిపింది. మార్పులకు తగినట్టుగానే న్యాయస్థానాల తీర్పులు లేదా వ్యాఖ్యానాలు కూడా ఉండి ప్రస్తుత భారత్‌కు అనుగుణంగా ఉండాలని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని ధర్మాసనం పేర్కొన్నది.
ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సహజ వనరులుగా పరిగణించొచ్చా అన్న కేసుపై కొద్ది నెలల క్రితం సీజేఐ నేతృత్వంలోని తొమ్మది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.ఏ ప్రైవేట్ ఆస్తి సమాజ వనరు కాదని.. అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులేనని, ఈ రెండు పరస్పర భిన్నమైన విధానాలని పేర్కొన్నది. వీటిపై ప్రస్తుత ప్రైవేటీకరణ, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానిం చాల్సిన అవసరం ఉందని తెలిపింది.
పౌరులు నష్టపోతే అనుమతించం..
చట్టప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ నష్టపరిహారం చెల్లించాలని, సరైన విధానాలను పాటించలేదని పార్క్ నిర్మాణం పేరుతో కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఓ వ్యక్తి ఆస్తిని స్వాధీనం చేసుకున్న కేసులో వ్యాఖ్యానించింది. వ్యక్తుల ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించినప్పటికీ వారికి రాజ్యాంగం తగిన రక్షణ కల్పించిందని గుర్తు చేసింది. తగిన పరిహారం ఇవ్వకుండా ఆస్తులను బలవంతంగా స్వాధీనం చేసుకుంటే పౌరులు నష్టపోవడానికి చట్టం అనుమతించబోదని తెలిపింది.