అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట (విజయక్రాంతి): వసతి గృహ విద్యార్థులను మన కన్నా పిల్లలుగా చూసుకోవాలని సంక్షేమ హాస్టల్స్ సంబంధిత అధికారులకు మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. గురువారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వసతి గృహాల సలహా సంఘం సమావేశంలో హరీశ్ మాట్లాడారు. నియోజక వర్గంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ లలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారంకు కృషి చేస్తానని చెప్పారు. ఎస్సి, ఎస్టీ, బిసి పాఠశాలల అనుబంధ హస్థల్స్, కళాశాలల అనుబంధ హాస్టల్స్ పని తీరు ఫై హాస్టల్స్ వారీగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
హాస్టల్స్ లలో ఉండే పేద విద్యార్థులని వారిని మన కన్నా పిల్లలుగా చూసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమ హస్థల్స్ అంటే నమ్మకం ఉండే కానీ ఈ ప్రభుత్వం లో సంక్షోభ హాస్టల్స్ గా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన మార్చ్, ఏప్రిల్ నుండి డైట్, కాస్మోటిక్ ఛార్జ్ లు రాకపోవడం పట్ల ప్రభుత్వం ఫై మండిపడ్డారు. హాస్టల్స్ లలో పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 7 నెలలు గా జీతాలు పెండింగ్ ఉన్నాయని తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాని కోరారు.. కళాశాల హాస్టల్స్ విద్యార్థుల కు వచ్చే ప్యాకెట్ మని రూ .500 ఈ విద్యాసంవత్సరం మొత్తానికి రాలేదన్నారు. తక్షణమే విడుదల చెల్లించాలని డిమాండ్ చేశారు.
స్థావేంజర్స్ నియమాకం లేక హాస్టల్స్ లో అపరిశుభ్రత తలెత్తకుండా వెంటనే స్టావేంజర్స్ ను నియమానించాలని చెప్పారు. హాస్టల్స్ లలో సమస్యలు, మౌలిక సదుపాయాలఫై ప్రతి పాదనలు ప్రభుత్వానికి పంపాలని చెప్పారు. నియోజకవర్గం లో అన్ని హాస్టల్స్ విద్యాధికారులు, తహసిల్దారులు ప్రత్యేక ద్రుష్టి సారించాలని సూచించారు. అద్దె భవనాలు ఉండే హాస్టల్స్ లలో అద్దె కట్టక నెలలు గడుస్తున్నాయని నా వంతుగా ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకెళ్తాని, కొన్ని హాస్టల్స్ లలో మరామ్మతులు చేపట్టెందుకు జిల్లా కలెక్టర్ కు నివేదిక ఇవ్వాలని కోరారు. అందరి సమన్వయం తో హాస్టల్స్ ను కాపాడేందుకు, విద్యార్తులకి ఇబ్బందులు రాకుండా కృషి చేద్దామని చెప్పారు. ఈ సమావేశం లో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, మండల విద్యాధికారులు, తహసిల్దారులు, సంక్షేమ శాఖ అధికారులు, వార్డెన్లు పాల్గొన్నారు.