18-04-2025 10:40:42 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనుల గురించి ప్రజలతో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ శుక్రవారం చర్చించారు. మరిపెడ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించి ఆ మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సీనియర్ జర్నలిస్టు జిన్నా లచ్చయ్యను ప్రభుత్వ విప్ పరామర్శించారు. ప్రమాద ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 5 వేల రూపాయలను లచ్చయ్యకు సహాయంగా అందజేశారు.