13-03-2025 10:55:59 AM
కులగణనలో కేసీఆర్ కుటుంబం పాల్గొనలేదు
బీఆర్ఎస్ రైతుబంధు ఇచ్చి.. అన్ని పథకాలు ఆపేసింది
రాష్ట్రంలో శాస్త్రీయంగా కులగణన
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Budget Session) గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. శాసనసభలో గవర్నర్(Governor Jishnu Dev Varma Speech) ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Aadi Srinivas) శాసనసభలో తీర్మానాన్ని ప్రతిపాదించారు. సభలో ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం బలపరిచారు. అప్పులతో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసిందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. రాష్ట్రంలో శాస్త్రీయంగా కులగణన జరుగుతోందని ఆయన సభలో వెల్లడించారు. కులగణనలో కేసీఆర్ కుటుంబం పాల్గొనలేదని తెలిపారు. కులగణనపై అభినందించకుండా.. విమర్శలు చేయడం బాధాకరం అన్నారు. గత ప్రభుత్వం కేవలం రైతుబంధు ఇచ్చి.. అన్ని పథకాలు ఆపేసిందని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. అన్ని ప్రాజెక్టులు వేగంగా ముందుకెళ్తున్నాయని ఆది శ్రీనివాస్ చెప్పారు. సన్న వడ్ల పండించిన రైతులకు రూ. 500 బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు.