హైదరాబాద్,(విజయక్రాంతి): బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) చౌకబారు విమర్శలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఆపాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Govt Whip Adi Srinivas) హెచ్చరించారు. మహేశ్వర్ రెడ్డి రెండు నెలలకోసారి మీడియా ముందుకు వచ్చి నోటికొచ్చిన ఆరోపణలు చేసి హడావిడి చేస్తున్నాడని మండిపడ్డారు. అవినీతి, అక్రమాలు అంటు గాలి అంతా పోగుసుకువచ్చి మీడియాలో చెప్పడం సరికాదని చెప్పారు. అర్థం పర్థం లేని ఆరోపణలు, ఆధారాలు లేని విమర్శలు ఆపాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.