calender_icon.png 24 January, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటోవాలాగా ప్రభుత్వ విప్ ‘ఆది’

24-01-2025 12:40:27 AM

సిరిసిల్ల, జనవరి 23 (విజయ క్రాంతి): వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ వద్ద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి అద్వర్యలో నిర్వహిస్తున్న జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు 2025లో భాగంగా నిర్వహిస్తున్న సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్త కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , ఏ ఎస్పీ శేషాద్రిని రెడ్డి పాల్గొని,జెండా ఊపి ప్రారంభించారు. తిప్పాపూర్ బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు స్వయంగా ఆది శ్రీనివాస్ ఆటో నడుపుకుంటూ  వెళ్లారు.

అనంతరం కోరుట్ల బస్టాండ్ వద్ద మానవహారంలో పాల్గొని రోడ్డు భద్రత ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించి, ప్రతీ ఒక్కరు రోడ్డు ఎక్కిన నుండి ఇంటికి వచ్చే వరకు క్షేమంగా వచ్చేలా జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. డ్రైవర్ స్థానంలో కూర్చున్న వారు నియమాలను పాటిస్తూ ఇంట్లో తమ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారని గమనిస్తూ ముందుకు పోవాలన్నారు.

మద్యం సేవించి, సెల్ ఫోన్ లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని,ఏదైనా అనుకోని ప్రమాదం ఎదురైతే వారి కుటుంబ సభ్యులు కుటుంబ పెద్దను కోల్పోతారని అన్నారు.రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.సి ఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి కృషి చేస్తున్నారన్నారు.వాహనదారులు రోడ్డు భద్రత తో పాటు ఆరోగ్య భద్రతా కూడా ఉండేలాచూసుకోవాలన్నారు.

ఆటో యూనియన్ వాళ్లకి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటమాన్నారు.ఇల్లు లేని ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, ఆటో యూనియన్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్,డిటివో లక్ష్మణ్ ,ఎంవిఐ వంశీధర్ , సీఐ విరప్రసాద్, ట్రాఫిక్ ఎస్‌ఐ సముద్రాల రాజు, కౌన్సిలర్ లు ఆటో యూనియన్ నాయకులు ఉన్నారు.