28-04-2025 01:59:45 AM
విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ నేతలు
మేడ్చల్, ఏప్రిల్ 27(విజయ క్రాంతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ నాయకులు అన్నారు. ఆదివారం తూముకుంటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పిసిసి పరిశీలకులు పారిజాత నరసింహారెడ్డి, భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరుకాగా, నియోజకవర్గ ఇన్చార్జి వజ్రాష్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తుందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్, మేడ్చల్ మున్సిపల్, మండల పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, గౌడవెల్లి రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.