02-04-2025 10:57:18 PM
కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి..
నిజాంసాగర్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని యువజన కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో జిల్లా యువజన కాంగ్రెస్ పదాధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కామారెడ్డి జిల్లా ఇన్చార్జ్ అమృత, సాయిబాబా విచ్చేసి జిల్లాలో యువజన కాంగ్రెస్ నూతనంగా ఎన్నికైన పదాధికారులకు అభినందనలు తెలిపారు.
జిల్లాలో యువజన కాంగ్రెస్ బలోపేతం చేయాలని ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే బాధ్యత, ప్రతిపక్షాల అర్ధరహిత ఆరోపణలను తిప్పికొట్టే బాధ్యత యువజన కాంగ్రెస్ నాయకులు బుజస్కందాల పైన వేసుకుని పని చేయాలని సూచించారు. రాజీవ్ యువ వికాస పథకాన్ని కింది స్థాయిలో ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇమ్రోజ్, మన్సూర్, సర్దార్, శ్రీనివాస్, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.