04-03-2025 12:28:05 AM
రైతు సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ
కోదాడ, మార్చి 3 ః కౌలు రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని తెలంగాణ రైతు సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ లోని ఎల్‌ఐసి ఏజెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ర్ట కౌలు రైతు సంఘం సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ర్ట ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించడానికి గ్రామ సభలను ఏర్పాటు చేయాలని అన్నారు.
కౌలు రైతులను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని కూడా రైతులతో పాటుగా కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలి అని తీర్మానం చేసామన్నారు. కొప్పోజ్ సూర్యనారాయణ, అన్నంపాపిరెడ్డి, బొల్లి ప్రసాదు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కంబాల శ్రీను జిల్లాప్రధాన కార్యదర్శి దొడ్డ వెంకటయ్య బెజవాడ వెంకటయ్య ఖమ్మం జిల్లా అధ్యక్షుడు రామారావు కొత్తగూడెం అధ్యక్షులు నెహ్రు నల్లగొండ జిల్లా అధ్యక్షులు బండమీద వెంకటయ్య రైతులు నరసింహారెడ్డి యలమంద నాగేశ్వరావు సంజీవరెడ్డి నరసయ్య దాసబోయినరామయ్య వెంకయ్య పాపిరెడ్డి పాల్గొన్నారు.