calender_icon.png 4 April, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలి

03-04-2025 10:45:17 PM

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గురువారం ప్రారంభించారు. లబ్ధిదారులకు స్వయంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఉద్దేశ్యం సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా చేయడమేనని తెలిపారు.

ఈ పథకం ద్వారా అర్హత గల కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ప్రతి పేద కుటుంబం ఆకలికి గురికాకుండా, పోషకాహారాన్ని సమృద్ధిగా అందుకునేలా ఈ పథకం రూపొందించబడిందని పేర్కొన్నారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా అమలు చేస్తామని, బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగ గౌడ్, సంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.