మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు...
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని అర్హులైన వారికి లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించనున్నామని మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం పట్టణంలోని వివిధ వార్డుల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని దీనిలో భాగంగా లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం పలువురు తమకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఆర్పీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.