calender_icon.png 22 January, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు

22-01-2025 06:48:32 PM

ఎంపీడీవో రాజేశ్వర్...

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి నేను రాజేశ్వర్ తెలిపారు. బుధవారం మండలంలోని వెంకటాపూర్, పోన్నారం సారంగపల్లి, గ్రామపంచాయతీలలో నిర్వహించిన గ్రామసభల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని దీనిలో భాగంగా లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం పలువురు తమ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా వర్తింపజేయాలని కోరుతూ దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ సతీష్, ఆర్ఐ పద్మజ, వ్యవసాయ విస్తరణ అధికారి కనకరాజు, కాంగ్రెస్ నాయకులు మాసు సంతోష్, పెంచాల రాజలింగు, రాచకొండ కమల మనోహర్ రావు రాయమల్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.