calender_icon.png 22 January, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు

22-01-2025 05:13:19 PM

చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి...

మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి కృషి చేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి(MLA Vivek Venkataswamy) స్పష్టం చేశారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఇందిరమ్మ మోడల్ హౌస్ కు భూమి పూజ చేశారు. అనంతరం పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన గ్రామసభల్లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సొంతిటి కళను సాకారం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టి అరులైన లబ్దిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ఆయన ఆన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందనీ ప్రతిపక్షాలు పనిగట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. 

కేసీఆర్ లక్ష 25 వేల కోట్ల రూపాయలను కాళేశ్వరం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడనీ, ఆ నిధులతో రాష్ట్ర ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించే అవకాశం ఉండేదనీ కేసీఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందనీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన గ్రామసభల్లో గత ప్రభుత్వ తప్పిదాలు కనబడుతున్నాయనీ, రైతు భరోసా కోసం చేస్తున్న ఫీల్డ్ సర్వేలో సాగుకు యోగ్యంగాలేని భూములకు రియల్ ఎస్టేట్ వెంచర్లు, సినిమా థియేటర్లు ఇటుక బట్టీలకు రైతుబంధు అమలుచేసి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు పూర్తిస్థాయిలో సర్వే చేసి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసిల్దార్ సతీష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సొత్కు సుదర్శన్, గుడ్ల రమేష్, గడ్డం రజిని, దుర్గం నరేష్, ఎండి జమీల్, సంఘి సంతోష్, ఎండి సుకూర్ మహంతు అర్జున్, ఆకారం రమేష్ కనకం రాజు మంకు రమేష్, మంద తిరుమల్, ఎర్ర రాజు, ఎండి పాషా, రాచర్ల గణేష్, చోటే మియా, రెడ్డి ఐలయ్య, రాయబారపు కిరణ్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.