మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు...
మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించే విధంగా చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని పలు వార్డుల్లో అధికారులు చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల సర్వేను ఆయన పరిశీలించి మాట్లాడారు. కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల లబ్ధిదారులను గుర్తించి అర్హులకు అందించనున్నట్లు తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు అందేవిధంగా చూడాలని ఆదికారులను కోరారు. వార్డుల్లో అధికారులు చేపట్టిన సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకెపి టీఎంసి రఘురాం, వార్డ్ అధికారులు, ఆర్పీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.