- రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్
శిశుసంరక్షణ కేంద్రాల పిల్లలకు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8(విజయక్రాంతి): శిశు సంరక్షణ కేంద్రాల్లోని పిల్లల భవిష్యత్‌కు ప్రభుత్వం అండగా ఉం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ కలెక్టరేట్‌లో జిల్లాలోని వివిధ శిశు సంరక్షణ కేంద్రాల్లో ఉంటున్న పిల్లలకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. అన్ని సంరక్షణ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ శిశు సంరక్షణ కేంద్రాల్లోని పిల్లలకు భవిష్యత్‌లో ఇబ్బందులు కలుగకుండా, చిన్న వయస్సులోనే వారికి అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలను అందజేశామన్నారు. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి 1,330 మంది పిల్లలకు సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముకుందరెడ్డి, డీఆర్వో వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే, కేటాయింపులు పారదర్శకంగా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం షేక్‌పేట్ ఎమ్మార్వో కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, ఇన్, ఔట్ వార్డు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆన్లున్ డాష్‌బోర్డు, రిజిస్టర్‌లను పరిశీలించారు. ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలోని భవనాన్ని అంగన్వాడీ కార్యాలయం, ఇతర కార్యాలయాలకు వినియోగించాలని సూచించారు.
బ్లాక్ స్పాట్‌ల పరిశీలన
ఎస్‌ఆర్ నగర్‌లో బ్లాక్ స్పాట్‌లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. జాతీయ రహదారుల భద్రత మాసోత్సవంలో భాగంగా ఎస్‌ఆర్ నగర్ ఉమేష్ ఐపీఎస్ విగ్రహం వద్ద తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్‌లను ఆయన పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పలు సూచనలు చేశారు. బ్లాక్ గుర్తించి ప్రమాదరహిత చర్యలు తీసుకుని రోడ్డు ప్రమాదాలను జీరోకు తగ్గించాలని పేర్కొన్నారు. అంత అమీర్‌పేట్‌లోని సీహెచ్‌సీ(కమ్యూనిటీ హెల్త్ సెంటర్)ను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు.
పది, ఇంటర్ ఫలితాల్లో మెరవాలి..
పది, ఇంటర్ ఫలితాల్లో హైదరాబాద్ జిల్లా మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని మంత్రి పొన్నం పేర్కొన్నారు. బుధవారం గోల్కొండలోని తెలం మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆర్థికభారమైనా మెస్ చార్జీలు పెంచినట్లు తెలిపారు.
తెలంగాణలో నాణ్యమైన విద్య: మంత్రి పొన్నం
పటాన్‌చెరు, జనవరి 8: తెలంగాణలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం పటాన్‌చెరులోని పాటి చౌరస్తాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ఎంఏ రాష్ట్ర కమిటీ సమావేశానికి మంత్రి పొన్నం ముఖ్యఅతిథిగా హాజరై మాటాడారు. రాష్ట్రంలో అరవై శాతం మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాల్లోనే చదువుతున్నారని చెప్పారు.
ప్రైవేట్ పాఠశాలల విద్యా సేవలను కొనియాడారు. సమాజంలో ప్రైవేట్ విద్యా సంస్థలకు గుర్తించదగ్గ స్థానం ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ఎంఏ డిమాండ్లు, సలహాలను ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. టీఆర్‌ఎస్‌ఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ మధుసూదన్, కార్యదర్శి రమేశ్‌రావు, కోశాధికారి రాఘవేందర్‌రెడ్డి, సంఘం ప్రతినిధులు విలయం జేమ్స్, ప్రభాకర్‌రెడ్డి, సాయితేజ, ఉమా మహేశ్వర్‌రావు, ఎండీ ఇస్తియాబ్ గుల్షన్ పాల్గొన్నారు.