calender_icon.png 4 March, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి జిఎంను సన్మానించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు..

03-03-2025 07:59:15 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి ఏరియా జిఎం దుర్గం రామచందర్, ఏజీఎం సివిల్ డి వెంకటేశ్వర్లు మణుగూరు ఎంఈఓ స్వర్ణ జ్యోతి ప్రభుత్వ ఉపాధ్యాయులు సోమవారం శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ స్వర్ణ జ్యోతి మాట్లాడుతూ.. మణుగూరు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని జిఎంను అభ్యర్థించగా.. ఇప్పటివరకు సి ఎస్ ఆర్ నిధుల నుంచి సుమారు 42 లక్షల రూపాయల విలువైన సామాగ్రిని అందించినట్లు తెలిపారు.

ఆయా పాఠశాలలకు అవసరమైన విధంగా కుర్చీలు, బెంచ్ లు, పిల్లలు కూర్చునే డెస్క్ బల్లలు, బీరువాలు అందించారని పేర్కొన్నారు. అడగగానే స్పందించి విద్యార్థులకు సౌకర్యార్థం మూడు విడతల్లో ఆయా పాఠశాలలకు అందించడంలో కృషి చేసిన జిఎం దుర్గం రామచందర్, ఏజీఎం సివిల్ డి.వెంకటేశ్వర్లు లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీలత, ఆయా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ నాయకులు పాల్గొన్నారు.