calender_icon.png 8 October, 2024 | 7:34 PM

మత్సకారులను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకుంటుంది

08-10-2024 04:24:38 PM

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి పధంలో ముందుకు తీసుకొని వెళ్లడమే ప్రభుత్వ ధ్యేయమని, తెలంగాణ రాష్ట్రప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం రోజు యాదగిరిగుట్ట మండలంలో లోని గౌరాయ పల్లి గ్రామంలో  చేపల చెరువులో 30,000  చేప పిల్లలను జిల్లా కలెక్టర్ హనుమంతు కె. జండగే తో కలిసి చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 100శాతం సబ్సిడీతో చేప పిల్లలను చెరువులలో వదలడం వల్ల మత్స్యకారులకు, ముదిరాజులకు ఆర్థికంగా ఎదగడానికి వీలుంటుందని అన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందన్నారు. చెరువులలో సమృద్ధిగా నీరు ఉన్నందున చేప పిల్లలు పెంచడానికి ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గోదావరి నుండి నీళ్లు విడుదల కావడంతో మత్యకారులు అందరు అభివృద్ధి పధంలో ముందుకు వెళ్లాలని అన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు. మత్స్యకారుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం చేపల ఉత్పత్తిని పెంచడం జరుగుతుందన్నారు. మహిళలు ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి మహిళా శక్తి స్కీమ్ ద్వారా జిల్లాలో కొత్తగా  మహిళా సంఘాలు  ఏర్పాటు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి రాజారామ్, మత్స్య సహకార సంఘ జిల్లా అధ్యక్షులు సంజయ్ ఉపాధ్యక్షులు , డైరెక్టర్లు కృష్ణ, ఝాన్సీ రవిశంకర్ సతీష్, శంకరయ్య కుమార్ నరసింహ, మత్స్యకారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.