రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య చైర్మన్ అమిత్‌రెడ్డి
కామారెడ్డి, అక్టోబర్ 30 (విజయక్రాంతి): పాడి రైతులకు మేలు చేకూర్చాలనే లక్ష్యం తో ప్రభుత్వం పాడి పరిశ్రమకు ఇతోధికంగా తోడ్పాటును అందిస్తోందని రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.50 కోట్ల నిధులు విడుదల చేశారని, వీటికి అదనంగా మరో రూ.10 కోట్లను జతచేసి పాడి రైతుల పాత బకాయిలను చెల్లించ డం జరిగిందని తెలిపారు.
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుతో కలిసి బుధవారం అమిత్‌రెడ్డి నిజామాబాద్ జిల్లా సారంగాపూర్‌లోని విజ య పాల డెయిరీ కేంద్రాన్ని సందర్శించారు. పాల సేకరణ, విక్రయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అమిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆశించిన స్థాయి లో పాల విక్రయం జరగని కారణంగా విజ య డెయిరీకి పాలు సరఫరా చేస్తున్న రైతులకు బిల్లులు చెల్లింపులలో కొంత జాప్యం జరుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తున్నామని తెలిపారు.