calender_icon.png 25 February, 2025 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడులతో వస్తే ప్రభుత్వ సహకారం

25-02-2025 02:05:03 AM

  1. లైఫ్‌సైన్సెస్, ఫార్మా, బయో-టెక్ రంగాల్లో అగ్రగామి తెలంగాణ
  2. అమ్జెన్  కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి 
  3. లైఫ్‌సైన్సెస్, ఫార్మా, బయో-టెక్ రంగాల్లో అగ్రగామి తెలంగాణ
  4. ట్రిలియన్ డాలర్ల జీడీపీ సాధించడమే లక్ష్యం
  5. అమ్జెన్  కార్యాలయ  ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): తెలంగాణలో పెట్టుబడులు పెట్టేం దుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు సహాకారమందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో సోమవారం ఆయన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి బయోటెక్నాలజీ కంపెనీ అమ్జెన్ కంపెనీ ఇన్నోవేషన్, టెక్నాలజీ కార్యాలయాన్ని ప్రార ంభించారు. పరిశోధనలు, నైపుణ్యాల అభివృద్ధి, విద్యారంగాల్లో పెట్టుబడులను తమ ప్రభుత్వం ఆహ్వానిస్తున్నదని తెలిపారు.

రాష్ట్రం ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయో-టెక్ రంగాల్లో అగ్రగామిగా ఉందని, ట్రిలియన్ డాలర్ల జీడీపీ సాధించే లక్ష్యంతో రాష్ట్రం ముందుకు సాగుతున్నదన్నారు. ‘అమ్జెన్’ కార్యకలాపాల విస్తరణతో హైదరాబాద్ బయోటెక్ హబ్ మారనున్నదన్నారు.

తాను గతేడాది ఆగస్టులో శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లానని, ఈ సందర్భంగా తాను అక్కడి అమ్జెన్ రీసెర్చ్ అండ్ డెవెలప్‌మెంట్ సెంటర్‌ను సందర్శించానని గుర్తుచే సుకున్నారు. దిగ్గజ ఆమ్జెన్ సంస్థ హైదరాబాద్‌కు రావడం అభినందనీయమన్నారు. స్పెషల్ సీఎస్ జయేశ్‌రంజన్, అమ్జెన్ చైర్మన్, సీఈవో రాబర్ట్ ఏ బ్రాడ్వే తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ బ్రాండ్‌ను పెంచుతాం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్ ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతున్నదని, నగర బ్రాండ్‌ను మరింత పెంచేలా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఐటీమంత్రి దుద్దళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉండడంతోనే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు ముందు కొస్తున్నాయమన్నారు. లైఫ్ సైన్సెస్ రంగం లో హైదరాబాద్‌ను గ్లోబల్ క్యాపిటల్‌గా మారుస్తామన్నారు. ఆరోగ్య రంగంలోనూ సిటీని నంబర్ వన్‌గా నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. గ్లోబల్ కేపాబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు హైదరాబాద్ హబ్‌గా మారిందని కొనియాడారు.

మానవ వనరుల కేంద్రంగా తెలంగాణను మార్చేందుకు స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరిశ్రమల భాగస్వామ్యంతో యువతకు ఉద్యోగాలు దక్కేలా కోర్సులు అందిస్తున్నట్లు వివరించారు. ఈ క్యాంపస్‌లో ఏడాది చివరి నాటికి ఉద్యోగుల సంఖ్య 600, రాబోయే రోజుల్లో 2 వేల మందికి చేరుతుందన్నారు. అమ్జెన్ భాగస్వామ్యంతో బయో టెక్నాలజీ రంగంలో నైపుణ్యం ఉన్న మానవ వనరులను తయారు చేస్తామన్నారు.

రూ.1600 కోట్ల పెట్టబడులు.. 

అమ్జెన్ కంపెనీ తమ కంపెనీ విస్తరణలో ఈ ఏడాది దాదాపు రూ.1,600 కోట్లు పెట్టుబడి పెడుతోంది. తద్వారా బయోఫార్మా రంగంలో భారీ ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఏఐ, డేటా సైన్స్ డిజిటల్ సెగ్మెంట్‌లో ఇన్నోవేషన్ సైట్‌గా సంస్థ అభివృద్ధి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంస్థ వంద దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సంస్థ పరిధిలో అన్ని దేశాల్లో కలిపి 28 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సంస్థ ౪ దశాబ్దాలుగా సంక్లిష్టమైన వ్యాధులను నయం చేసేందుకు ఔషధాలు తయారు చేస్తోంది. క్యాన్సర్, గుండె వ్యాధులను నయం చేసేందుకు ఔషధాలను తయారుచేస్తోంది.