calender_icon.png 2 October, 2024 | 8:02 AM

నేతన్నల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ తోడ్పాటు

02-10-2024 01:10:01 AM

సిరిసిల్లలో నూలు డిపో ఏర్పాటు

రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్

కరీంనగర్, అక్టోబరు 1 (విజయక్రాంతి): చేనేత కార్మికులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ అన్నారు. మంగళవారం వేములవాడలో చేనేత కార్మికుల సమస్యలు, వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, పెండింగ్ బకాయిలు, ఆర్డర్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో   సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ.. సిరిసిల్లలో చేనేత రంగం స్వతంత్రంగా ఎదగాలని కాం క్షిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి నూలు డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పెండింగ్ బకాయిలు చెల్లింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణలోని మహి ళా సంఘాలకు 2 చీరల చొప్పున ఇచ్చేందు కు ప్రభుత్వం నిర్ణయించిందని, దీని ద్వారా సిరిసిల్ల జిల్లా చేనేతలకు ఉపాధి లభిస్తుందన్నారు.

నూలు డిపో పెట్టిన తర్వాత దాని తరలింపు బాధ్యత ఆసాములదేనని అన్నా రు. సొసైటీకి నూలు అప్పగించిన తర్వాత లాభాలను సేట్లు, ఆసాములు, వర్కర్లు ఎలా తీసుకుంటారు అనే అంశాలను వివరించాలని అన్నారు. ప్రస్తుతం వచ్చే లాభం అధి కంగా ఆసాములకు చేరాలని ప్రభుత్వం భావిస్తుందని అన్నారు.

100 శాతం దీనిపై ఆధారపడకుండా ప్రైవేట్ మార్కెట్‌లో కూ డా చేనేతలు రాణించేలా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. ప్రభుత్వ విప్, వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడు తూ.. చేనేతల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని చెప్పారు.

ఈ సమావేశంలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝూ, అదనపు కలెక్టర్ ఎస్ ఖీమ్యా నాయక్, వేములవాడ ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, టెస్కో జీఎం అశోక్‌రావు, హ్యాండ్లూ మ్స్ ఏడీ సాగర్, నేత కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

వేములవాడ అభివృద్ధికి చర్యలు

ఆధ్మాత్మిక పట్టణంగా వేములవాడ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామ య్యర్ అన్నారు. మంగళవారం వేములవాడలో పర్యటించిన ఆమె ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి గెస్ట్ హౌస్ సమావేశ మందిరం లో ఆలయ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఆలయం సమీపంలో అందుబాటులో ఉన్న 36 ఎకరాల స్థలంలో వసతిగృహాలు, దేవస్థాన కార్యాలయం, పార్కింగ్, క్యూ కాంప్లెక్స్, సాంస్కృతిక జోన్, బతుకమ్మ పండుగ నిర్వహణకు సాంస్కృతిక వేదిక, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.275 కోట్లతో సమ గ్ర ప్రణాళిక రూపొందించాలని అన్నారు.

వేములవాడ పట్టణంలోని బస్టాండ్, రాబో యే రైల్వే స్టేషన్ నుంచి దేవాలయానికి వచ్చే కనెక్టివిటీ రోడ్లు ఆధ్మాత్మిక శోభతో ఉండేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. వేములవాడ పట్టణంలో అవసర మైన రోడ్లు, ప్లాట్ ఫాం, జంక్షన్ సుందరీకరణ, లైట్ల ఏర్పాటుకు రూ.80 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని అన్నా రు.

వేములవాడ ప్రధాన దేవాలయ అభివృద్ధి రూ.70 కోట్లతో చేపట్టాలని, అందు కు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడు తూ.. ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తామని అన్నా రు. ఈ సమావేశంలో ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.