calender_icon.png 1 April, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యార్థులకు ఆంగ్లం రావాలి

28-03-2025 12:05:18 AM

వికారాబాద్, మార్చి-27: ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠ శాల విద్యార్థులకు ఆంగ్ల బోదన గావించి , పిల్లలు ఆంగ్లం లో ధారాళంగా మాట్లాడటం హర్షించదగిన విషయమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.

గురువారం   కలెక్టరేట్ సమావేశము హాలు నందు జరిగిన  యంగ్ ఓరేటర్స్ క్లబ్ మరియు బొస్చ్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  విద్య  కదంబం  కార్యక్రమంలో జిల్లా  కలెక్టర్ పాల్గొని మా ట్లాడుతూ జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో ఏర్పాటుచేసిన వై ఓ సి యంగ్ ఓటర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా లో ఉన్నటువంటి  ఉన్నటువంటి ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ బోధించడం జరిగిందని , ఇంగ్లీష్ కు  సంబంధించి విద్యార్థులు దారాళంగా ఇంగ్లీషు మాట్లాడడానికి   ఉపాధ్యా యులు వివిధ రకాల కృత్యాలు మరియు యాక్టివిటీస్ ద్వారా ఇంగ్లీష్  నేర్పించడం జరిగిందని , ఇంగ్లీష్ మాట్లాడడానికి  ఉపాద్యాయులు  బోధన జరిపించడం పట్ల సం తోషాన్ని వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా వై ఓ సి చేస్తున్నటువంటి సేవలు కొనియాడారు.అదేవిధంగా వైఓసి క్లబ్ ద్వారా పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడటం  చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. రాబోవు రోజుల్లో ఇంగ్లీష్ పట్ల మరింత శ్రద్దను చూ పిస్తూ పిల్లలకు ఇంగ్లీషు భాష పట్ల ఆసక్తిని   కలిగించేలా భోధించాలని సూచించారు. విద్యార్థులు మాతృభాషతో పాటు ఇంగ్లీష్ భాషను  కూడా కచ్చితంగా నేర్చుకుని ఉండాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన నాటికను తిలకించి సంతోషాన్ని వ్యక్తపరిచారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాదికారి రేణుక దేవి ,మరియు వై ఓ సి సభ్యులు, డిఆర్పీలు విద్యార్థులు పాల్గొన్నారు.