calender_icon.png 10 January, 2025 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు

10-01-2025 12:00:00 AM

కలెక్టర్ రాహుల్ రాజ్

పాపన్నపేట, జనవరి 9 : విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ పాపన్నపేట మండలం చికోడు జిల్లా పరిషత్ హైస్కూల్, షెడ్యూల కులాల బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. విద్యార్థుల భోజనశాలను, స్టోర్ రూమును పరిశీలించారు.

మెనూ అమలు తీరును హై స్కూల్ ప్రధానోపాధ్యాయులను  అడిగి తెలుసుకున్నారు. తరగతి గదిలో కలెక్టర్ టీచర్‌గా మారి పాఠాలు బోధించి ప్రశ్నలతో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చీకోడు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు, సంబంధిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.